Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూర్కీలో చర్చ్‌పై ఐరన్ రాడ్లతో వీరంగం
- అనేక మందికి గాయాలు
- సామాగ్రి ధ్వంసం
- ప్రాణాపాయ స్థితిలో చర్చ్ వాలంటీర్
డెహ్రడూన్ : బీజేపీ ప్రభుత్వ పాలనలో ఉన్న ఉత్తరాఖండ్‌లో హిందూత్వ శక్తులు రెచ్చిపోయాయి. రాష్ట్రంలోని రూర్కీ పట్టణంలోని ఒక చర్చ్‌పై ఆదివారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ), భజరంగ్ దళ్, బీజేపీ యువజన విభాగానికి చెందిన 200కు పైగా స్త్రీ, పురుషులు ఐరన్ రాడ్లతో విధ్వంసానికి దిగారు. ప్రార్థనలు చేసుకుంటున్నవారిపై దాడి చేయడంతో పాటు చర్చిలో సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ దాడిలో అనేక మంది గాయపడగా, చర్చ వాలంటీర్ ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. హిందుత్వ శక్తుల దాడిలో చర్చిలో కుర్చీలు, టేబుళ్లు, సంగీత వాయిద్య పరికరాలు, ఫోటోగ్రాఫులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆదివారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఉదయం 10 గంటల సమయంలో 200కు పైగా ఉన్న గుంపు ఒక్కసారిగా చర్చిలోకి దూసుకొచ్చింది. ఈ దాడిపై చర్చ్ పాస్టర్ భార్య ప్రియో సాధన లాన్సే ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ దాడి గురించి ఆమె మీడియాకు వివరించారు.