Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం వ్యాఖ్య : కేంద్రానికి చీవాట్లు
న్యూఢిల్లీ : దేశంలో వైద్య విద్య వ్యాపారంగా మారిపోయిందని సుప్రీం కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. నీట్ సూపర్ స్పెషాలిటీ- 2021 ప్రవేశ పరీక్ష నిర్వహణకు సంబంధించి చివరి నిముషంలో మార్పులు చేయడంపై జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ప్రభుత్వాన్ని, జాతీయ పరీక్షల బోర్డు (ఎన్బిఇ)ని కోర్టు మందలించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లను భర్తీ చేయడానికి వీలుగా చివరి నిముషంలో ఈ మార్పులు చేయడం పట్ల కోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసింది. . ఈ దేశంలో వైద్య విద్య విషాదమిది'' అని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.