Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీటర్ పెట్రోల్‌పై 25పైసలు, డీజిల్‌పై 30పైసలు పెంపు
- రూ.100కు చేరువగా.. డీజిల్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సామాన్యుడు ఎంత మొత్తుకున్నా.. ఇంధన ధరల పెంపు ఆగటం లేదు. డీజిల్ ధర కూడా రూ.100దాటడానికి రంగం సిద్ధమైంది. మంగళవారం లీటర్ పెట్రోల్‌పై 25పైసలు, లీటర్ డీజిల్‌పై 30పైసలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్‌లో లీ.పెట్రోల్ రూ.106.77, లీ.డీజిల్ రూ. 99.37కు చేరుకు న్నాయి. ఇటీవల కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఇలా పెరగడమే ఆలస్యం..అదే స్థాయిలో దేశీయంగా ఇంధన ధరల్ని మోడీ సర్కార్ పెంచుతోంది. జులై చివరివారం నుంచి ఆగస్టు, సెప్టెంబరు వరకు అంతర్జా తీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ ధర 75 డాలర్ల నుంచి 56 డాలర్ల వరకు పడిపో యింది. ఆ సమయంలో ధరల స్థిరీకరణ పేరుతో పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించేందుకు మోడీ సర్కార్ ససేమిరా అంది. చమురు కంపెనీలే స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటున్నాయని చెప్పింది. అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తటంతో కంటితుడుపు చర్యగా పెట్రోల్, డీజిల్‌పై కొన్ని పైసలు తగ్గించింది. అయితే గతవారం రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు పెరగడమే ఆలస్యం..ఆ భారాన్ని వెంటనే సామాన్యులపై కేంద్రం మోపుతోంది. నేడు దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ రూ.110 దిశగా వెళ్తోంది.