Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానా సీఎం ఖట్టర్, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలి
- ఈ ప్రధాన డిమాండ్లతో ఎస్కేఎం త్వరలో కార్యాచరణ
- పోస్టుమార్టం తరువాత రైతుల మృతదేహాలకు అంత్యక్రియలు
- వీడియో వైరల్‌తో మోడీ భక్తి టీవీ ఛానల్స్ అవాక్కు
న్యూఢిల్లీ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశీష్ మిశ్రా టెని, అతని సహచరులను వెంటనే అరెస్టు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) డిమాండ్ చేసింది. అంత్యక్రియలు నిర్వహించడానికి మార్గం సుగమం చేసేందుకు మాత్రమే తాము అడ్మినిస్ట్రేషన్‌తో చర్చలు జరిగాయనీ, అందులో భాగంగానే ఒప్పందం జరిగిందని ఎస్కేఎం తెలిపింది. ఎస్కేఎం ప్రధాన డిమాండ్లు అలాగే ఉన్నాయని స్పష్టం చేసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా టెని, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌లను వెంటనే తమ పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ ప్రధాన డిమాండ్లపై ఎస్కేఎం త్వరలో కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రకటిస్తుందని పేర్కొంది. పోస్టుమార్టం అనంతరం ఈ దారుణ ఘటనలో చనిపోయిన వారి అంత్యక్రియలు మంగళవారం జరిగాయి. లఖింపూర్ ఖేరీ మారణకాండలో తీవ్రంగా గాయపడిన ఎస్కేఎం నాయకుడు తజిందర్ విర్క్‌ను గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు సర్జరీ జరిగింది. ప్రాణాపాయం నుంచి ఆయన బయటపడినట్టు ఎస్కేఎం తెలిపింది. ఎస్కేఎం నేత గుర్నామ్ సింగ్ చాదునిని అరెస్టు చేసి నిర్బంధించటాన్ని ఎస్కేఎం ఖండించింది. యూపీ ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ వైఖరి చట్టవిరుద్ధమని, దాన్ని ఎస్కేఎం సవాల్ చేస్తుందని పేర్కొంది. లఖింపూర్ ఖేరీ మారణకాండ ప్రపంచం ముందు పూర్తిగా ఉద్భవించిందని తెలిపింది. పంజాబ్ ప్రజలు లఖింపూర్ ఖేరీకి రాకుండా నిరోధించడానికి యూపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎస్కేఎం ఖండించింది.
రాష్ట్రాల్లో ఊపందుకున్న ఆందోళనలు
రాజస్థాన్‌లో ధాన్యం సేకరణ చేపట్టాలని హనుమాన్‌గఢ్ కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. పోలీసులు రైతులను వెంటాడుతూ విచక్షణారహితంగా లాఠీలతో కొట్టారు. నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసు హింసను ఎస్కేఎం తీవ్రం గా ఖండించింది. కొంతమంది రైతులకు తీవ్ర గాయాలై ఆస్పత్రి పాలయ్యారు. రైతులు అడిగిన విధంగా రాజస్థాన్ ప్రభుత్వం ధాన్యం సేకరణను ప్రారంభించాలనీ, అలాగే సాగునీటి సరఫరా లేకపోవడం వల్ల పంటలు నాశనం కాకుండా చూసుకోవాలని ఎస్కేఎం కోరింది. హిమాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో రైతు ఉద్యమం మరింత ఊపందుకుంది. లఖింపూర్ ఖేరీ మారణకాండకు వ్యతిరేకం గా ఆగ్రహం, ప్రతిఘటనను వ్యక్తం చేయడానికి అనేక ప్రాంతాల్లో ఆకస్మిక నిరసనలు జరిగాయి. అనేక చోట్ల బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి.
లఖింపుర్ ఖేరి ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి!
- సీజేఐకి యూపీ న్యాయవాదుల లేఖ
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో జరిగిన బీజేపీ హింసోన్మాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతూ ఉత్తర్‌ప్రదేశ్ న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు మంగళవారం లేఖ రాశారు. రైతులపై దూసుకొచ్చిన వాహనం కేంద్రమంత్రి అజరు మిశ్ర కుమారుడు ఆశిష్ది అని, అందులో ఆయన కూడా ఉన్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు అతడిని ఎందుకు అరెస్టు చేయలేదని పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రైతులపై కారుతో తొక్కించి...చంపిన దారుణంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసేలా హౌంమంత్రిత్వశాఖను ఆదేశించాలని పిటిషన్లో న్యాయవాదులు సీజేఐని కోరారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మంత్రులనూ శిక్షించాలన్నారు. మరోవైపు ఈ ఘటనలో నలుగురు రైతులు మృతిచెందగా.. వారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. మరో రైతు మృతదే హానికి రీ-పోస్టుమార్టం చేయనున్నట్టు సమాచారం. రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్, యూపీ పోలీసుల మధ్య చర్చల అనంతరం ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ఆదివారం నుంచి నిలిపివేసిన ఇంటర్నెట్ సేవలను అధికారులు ఈ సాయంత్రం పునరుద్ధరించారు.