Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెల 26న విచారిస్తామన్న న్యాయస్థానం
న్యూఢిల్లీ: గుజారత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను దివంగత నేత, కాంగ్రెస్ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను వాయిదా వేయబోమనీ, ఈ అక్టోబర్ 26న దీనిపై విచారణ జరుపుతామని జస్టిస్ ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కాగా, ప్రధాని మోడీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సమయంలో 2002లో అల్లర్లు జరిగాయి. గోద్రా అల్లర్ల ఘటన తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనల్లో వేయి మందికి పైగా చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది మైనార్టీలు ఉన్నారు. 2002 ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్ సొసైటీలో చెలరేగిన హింసలో మరణించిన 68 మందిలో ఎహ్సాన్ జాఫ్రీ కూడా ఉన్నారు. అయితే, ఈ అల్లర్ల జరగడంలో మోడీ, రాష్ట్ర మంత్రులేవరి పాత్ర లేదంటూ దీనిపై ఏర్పాటైన నానావతి-షా కమిషన్ రిపోర్టు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే 2017 అక్టోబర్ 5న గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను సవాలు చేస్తూ జాకియా జాఫ్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు.