Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచారణ జరపనున్న జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరి హింసపై విచారణకు అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, న్యాయమూర్తులు సూర్య కాంత్, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం నేడు (గురువారం) ఈ కేసును విచారించనున్నది. లఖింపూర్‌లో రైతులు చేపట్టిన ఉద్యమంపై కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా తన వాహనాల కాన్వారు ఎక్కించాడు. ఈ ఘటనలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మరణించారు. అలాగే కారు బోల్తా పడి కార్ డ్రైవర్, అనంతరం జరిగిన హింసలో మరో ముగ్గురు చనిపోయారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు న్యాయవాదులు శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా సీజేఐ ఎన్వి రమణకు లేఖ రాశారు. అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు ఈ ఘటనలో పాల్గొన్న దోషులకు శిక్ష పడేలా కేంద్ర హౌం మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరారు. లఖింపూర్ హింసాకాండకు సంబంధించి కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడి, అతని అనుచరులపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదయింది.