Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల నేపథ్యంలో ఉచితాలు షురూ
ముందుగానే తాయిలాలు అందించేందుకు సిద్ధం
లక్నో : వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువతను ఆకర్షించేందుకు యోగి సర్కార్ దృష్టి సారించింది. ముందుగానే తాయిలాలను అందించేందుకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా యువతకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పథకానికి యూపీ క్యాబినేట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, స్కిల్ డెవలప్మెంట్, పారామెడికల్, నర్సింగ్ మొదలైన వివిధ టీచింగ్/ట్రైనింగ్ ప్రోగ్రామ్లలో చేరిన యువతకు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. యువత సాంకేతిక సాధికారిత కోసమేనని యోగి సర్కార్ పేర్కొంది. టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్ల కోసం రాష్ట్రంలోని 'సేవా మిత్ర' పోర్టల్లో నమోదు చేసుకోవాలని తెలిపింది. ఈ పథకంతో ప్రభుత్వంపై రూ. 3000 కోట్ల భారం పడనున్నట్టు పేర్కొంది. కరోనా మహమ్మారి సమయంలో ఆన్లైన్ తరగతుల దృష్ట్యా వీటిని పంపిణీ చేయాలని నిర్ణయించామని యోగి సర్కారు తెలిపింది.