Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: ప్రముఖ కార్టూనిస్ట్, కేరళ కార్టూన్ అకాడమీ చైర్మన్ సిజె. ఏసుదాసన్ (83) మృతి చెందారు. ఇటీవల కొవిడ్ బారిన పడిన ఆయన చికిత్స తీసుకున్నారు. నెగిటివ్ రావడంతో ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులున్నారు. కేరళ కార్టూన్ అకాడమీకి ఏసుదాసన్ మొదటి చైర్మన్గా నియమితులయ్యారు. ఆయన మృతికి కొచ్చిలోని సీనియర్ జర్నలిస్ట్ యూనియన్ సంతాపం ప్రకటించింది. ఏసుదాసన్ ఎంతో సౌమ్యమైన వ్యక్తి అనీ, ప్రతి ఒక్కరినీ గౌరవించేవారని ఢిల్లీలోని ప్రముఖ కార్టూనిస్ట్ సుధీర్నాథ్ పేర్కొన్నారు. తాను ఆయన శిష్యుడనేననీ, కార్టూన్ కళలోని ప్రాథమిక సూత్రాలను ఆయన దగ్గరే నేర్చుకున్నానని అన్నారు.