Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కృష్ణానదీ జలాల పంపకంపై తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పాటైన కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభించింది. కరోనా నేపథ్యంలో కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న క్రాస్ ఎగ్జామినేషన్ బుధవారం ప్రారంభమైంది. జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. తెలంగాణ తరపున ఘన్‌శ్యాం ఝాను ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది వెంకటరమణి క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. సాగునీటికి సంబంధించిన అంశాలపై వెంకటరమణి ప్రశ్నలకు ఘన్‌శ్యాం సమాధానాలు ఇచ్చారు. గురువారం కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనున్నది.