Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెల్లడించిన కేంద్రమంత్రి తనయుడి అనుచరుడు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో లఖింపూర్ ఖేరీ ఘటనలో మరో వీడియో తాజాగా వెలుగుచూసింది. రైతులపై నుంచి ఓ వాహనం దూసుకు వెళ్లిన తర్వాత ఓ వ్యక్తిని పోలీసు అధికారి విచారణ జరుపుతున్నట్టు కనిపిస్తోంది. అందులో ఓ వ్యక్తి రక్తంతో తడిసిపోయి.. నేలపై కూర్చుని ఉండగా.. పోలీసు మోకాళ్లపై కూర్చొని, చేతిలో మైక్ పట్టుకుని ప్రశ్నిస్తున్నట్టు వీడియోలో దర్శనమిస్తోంది. లక్నోలోని ఛార్భాగ్ ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తిపై అధికారి ప్రశ్నల వర్షం కురిపించారు. తాను బ్లాక్ ఫార్చూన్ కారులో ఐదుగురితో కలిసి ఉన్నాననీ, కారు వెనుక కూర్చున్నాననీ, ఆ కారు మాజీ కాంగ్రెస్ ఎంపీకి చెందిందని అన్నారు. అదేవిధంగా కారు ప్లేట్ నంబర్ కూడా ఇవ్వడం గమనార్హం. కారు ముందు ఎవరు కూర్చున్నారు అని పోలీసు అధికారి అడగ్గా... తొలుత తనకు తెలియదన్న ఆయన... పోలీసు మళ్లీ ప్రశ్నించడంతో భయ్యా అని కేంద్ర మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మెహ్ర నుద్దేశించి చెప్పారు. అయితే వారంతా అతడి మనుషులేనా అని అడగ్గా..అవునని సమాధానం చెప్పారు. గత వీడియోలో ఆందోళనలు చేపడుతున్న అన్నదాతలపై ఎస్యూవీ వాహనం దూసుకెళ్లిన దృశ్యాలు బహిర్గతమయ్యాయి.