Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రసాయన శాస్త్రాన్ని పర్యావరణ హితంగా మార్చే పరిశోధనలకు పురస్కారం
స్టాక్హౌమ్: 2021 ఏడాదికి గారూ ఇప్పటికే పలు విభాగాలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతులు ప్రకటించారు. తాజాగా రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతులను వరించిన వారి వివరాలు రాయల్ స్వీడిష్ ఆకాడమీ ప్రకటించింది. ఈ ఏడాది రసాయన శాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలను నోబెల్ వరించింది. అసిమెట్రిక్ ఆర్గానోక్యాటలసిస్ను అభివృద్ధి చేసినందుకు గానూ శాస్త్రవేత్తలు బెంజమిన్ లిస్ట్, డేవిడ్ విసి. మెక్మిల్లన్లకు ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని అందిస్తున్నట్టు అకాడమీ ప్రకటించింది. ''అణువులను నిర్మించడం చాలా కష్టమైన ప్రక్రియ. అలాంటిది పరమాణువు నిర్మాణంలో ఆర్గానోక్యాటలసిస్ అనే స్పష్టమైన నూతన విధానాన్ని బెంజిమిన లిస్ట్, డేవిడ్ మెక్మిల్లన్లు అభివృద్ధి చేశారు. ఇది ఔషధాల పరిశోధనల్లో గొప్ప ప్రభావం చూపించింది. రసాయన శాస్త్రాన్ని పర్యావరణ హితంగా మార్చింది'' అని రాయల్ స్వీడిష్ అకాడమీ తన ప్రకటనలో పేర్కొంది. ఈ క్యాటలసిస్ను శాస్త్రవేత్తలు 2000 సంవత్సరంలో అభివృద్ధి చేసినట్టు తెలిపింది. వీరి పరిశోధనలు ఇప్పటికే మానవాళికి ఎంతోగానో ఉపయోగపడుతున్నాయంటూ ప్రశంసలు కురిపించింది.