Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీజింగ్ యూనిట్ మూసివేసే నిర్ణయం
- ఆకర్షణీయ ఆఫర్లంటూ లీజు ఒప్పందాలపై డ్రైవర్ల సంతకాలు : కార్మిక సంఘం ఐఎఫ్ఏటీ ఆరోపణలు
న్యూఢిల్లీ: ఓలా తన క్యాబ్ డ్రైవర్లను మోసం చేస్తున్నదని కార్మిక సంస్థ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ (ఐఎఫ్ఏటీ) ఆరోపిస్తోంది. ఓలా టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్, ఏఎన్ఐ టెక్నాలజీస్ ప్రయివేటు లిమిటెడ్‌లు భారీ కుంభకోణానికి పాల్పడ్డాయని చెబుతోంది. క్యాబ్-అగ్రిగేటర్‌గా ప్రారంభమైన దేశంలోని మొట్టమొదటి రైడ్ షేరింగ్ కంపెనీ దాదాపు అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల్లో ''చిన్న ప్రయాణ ఏజెంట్లు'' లేకుండా పూర్తిగా నిర్మూలించిందనీ, క్యాబ్ యజమానులను వారి డ్రైవర్ భాగస్వాములుగా చేసిందని వర్కర్స్ యూనియన్ పేర్కొంది. అలాగే, టాక్సీ రంగంలో ''డిక్టేటింగ్'' నిబంధనలను ప్రారంభించిందని ఆరోపించింది. ఐఎఫ్ఏటీ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో ''కొంత మంది డ్రైవర్లు ఇతర క్యాబ్ సర్వీసుల నుంచి వస్తున్న పోటీ, ఓలాలో భాగస్వాములుగా డ్రైవర్లు సంతోషంగా లేరని గ్రహించిన ఓలా తన సొంత వాహనాలను నడపడానికి 'ఓలా లీజింగ్' అనే పథకంతో ముందుకు వచ్చింది. ఇది డ్రైవర్, సంస్థకు ఇద్దరికీ సహేతుకమై లాభదాయకంగా కనిపించినప్పటికీ.. ఈ పథకం వెనుక ఉన్న నిజమైన ఉద్దేశం డ్రైవర్లను మోసం చేయడమే'' అని ఐఎఫ్ఏటీ అధ్యక్షుడు షేక్ సలా వుద్దీన్ అన్నారు. కంపెనీలో ప్రత్యేక భాగస్వాములు కావడానికి, అలాగే,వారు నడుపుతున్న కారును సొంతం చేసుకోవడానికి అంటూ ఈ లీజు ఒప్పందం తీసుకువచ్చింది. దీనిలో భాగంగా డ్రైవర్లు నాగులు సంవత్సరాల పాటు రోజుకూ రూ.700 నుంచి రూ.1150 చెల్లించాలి. పేద-నిరక్షరాస్యు లైన అనేక మంది డ్రైవర్లు ఈఆకర్షణీయమైన ఆఫర్‌కు బలైపోయి లీజు ఒప్పం దంపై సంతకం చేసినట్టు సలావుద్దీన్ తెలిపారు. అయితే, చివరికీ రోజువారీ వాయిదా ఒప్పందంలో రోజువారీ అద్దెగా దీనిని చూపించింది.