Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ, యోగి పాలనకు దగ్గరి పోలిక : సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ, ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ పాలన బ్రిటిష్ పాలనతో పోలి ఉన్నాయని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. బుధవారం నాడిక్కడ ఆయన మాట్లాడుతూ ''బ్రిటిష్ పాలనలో ఈ రకమైన దారుణాలు, క్రూరత్వాలు జరగడం మనకు స్పష్టంగా కనిపించాయి. సరిగ్గా అలానే మోడీ, యోగి ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఈ సంఘటన చంపారన్‌లో బ్రిటిష్ వారు చేసిన దారుణాలను గుర్తు చేస్తుంది. ఈ ప్రభుత్వానికి హింసించే అలవాటు ఉన్నది. ఈ అలవాటు ప్రతి రోజు పెరుగుతున్నది'' అని ఏచూరి విమర్శించారు. ''దేశంలో ఏ పౌరుడైనా ఏ ప్రాంతంలోనైనా ప్రయాణించవచ్చు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఆపుతుంది.? ఇది రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే'' అని పేర్కొన్నారు. లఖింపూర్ ఘటనకు కారణమైన వారిని వీలైనంత త్వరగా జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అంటే దర్యాప్తు ప్రారంభమైనట్టు కాదనీ, దర్యాప్తు ప్రారంభించి, బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని ఏచూరి డిమాండ్ చేశారు.