Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐఏటీఏ అంచనా
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో అంతర్జాతీయ విమాన పరిశ్రమ భారీ నష్టాలను ఎదుర్కొంటుంది. 2020-22 మధ్య కాలంలో పరిశ్రమ 201 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.15 లక్షల కోట్ల) నష్టాన్ని చవి చూడొచ్చని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఎటిఎ) అంచనా వేసింది. కొన్ని సమస్యలున్నప్పటికీ, సంక్షోభ తీవ్రత నుండి బయటపడుతున్నామని ఐఎటిఎ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ పేర్కొన్నారు. అమెరికాలోని బోస్టన్లో జరిగిన ఐఎటిఎ 77వ వార్షిక సదస్సులో వాల్స్ మాట్లాడుతూ ప్రస్తుతం పరిశ్రమ కోలుకునే దిశగానే పయనిస్తుందన్నారు. గతేడాది 2020లో పరిశ్రమకు 138 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని, 2021లో 52 బిలియన్ డాలర్ల మేర తగ్గనుందని అంచనా వేస్తున్నామన్నారు. ఇక 2022లో నష్టాలు 12 బిలియన్ డాలర్లకు తగ్గొచ్చన్నారు. 2023లో పరిశ్రమ లాభాల బాట పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ విమాన పరిశ్రమ ఆదాయం ఈ ఏడాది 472 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చన్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 26.7 శాతం పెరగనుంది. 2022లో ఆదాయం 39.3 శాతం వద్ధితో 658 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చన్నారు. ప్రస్తుతం కరోనా ముందుస్థాయితో పోలిస్తే 70 శాతం సేవలు అందుబాటులోకి వచ్చాయని ఐఎటిఎ పేర్కొంది. భారత్లో గడిచిన ఆగస్టులో దేశీయంగా 68 లక్షల నుండి 69 లక్షల ప్రయాణికులు నమోదయ్యారు.