Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లఖింపూర్ ఖేరీ దుశ్చర్యను నిరసిస్తూ పాలక పక్షాల పిలుపు
- 10నెలల రైతు ఉద్యమం తర్వాత మహావికాస్ అఘాడి మద్దతు
ముంబయి: లఖింపూర్ ఖేరిలో చనిపోయిన రైతులకు ఇటీవల మహారాష్ట్ర క్యాబినెట్ నివాళులర్పించింది. రెండు నిమిషాలు మౌనం పాటించింది.ఉత్తరప్రదేశ్లో రైతులపై వాహనాలతో తొక్కించిన ఘటనపై శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కాంగ్రెస్ చర్చించాయి. ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు,నీటిపారుదల శాఖమంత్రి జయంత్ పాటిల్ యోగి నేతృ త్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. రైతుల ప్రశాంతంగా ప్రదర్శన నిర్వహిస్తుండగా..కారులో ఢకొీట్టి చంపారని సామాజిక మాధ్యమాల్లో వీడియోలు స్పష్టంగా సూచిస్తున్నాయని తెలిపారు. నేరస్తులను ఇప్పటి దాకా అరెస్టు చేయలేదనీ, బీజేపీ నాయకులను కాపాడటానికి పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఆరోపించారు.శివసేనకు చెందిన మంత్రి సుభాష్ దేశారు సమర్థించారు. రైతులపై అలాంటి దాడిని సహించమని..చురుకైన సందేశం ఉండాలని దేశారు చెప్పారు.