Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుమోటోగా కేసుల నమోదుపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ : నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి)కి సుమోటోగా కేసుల విచారణ చేపట్టే అధికారం ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. లేఖలు, పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించి విచారణ చేయొచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది. ముంబయిలో ఘన వ్యర్థాల నిర్వహణ లోపంతో డంపింగ్ యార్డ్ సమీపంలో నివసించే వారిపై ప్రభావం చూపడంపై ఆంగ్ల న్యూస్ పోర్టల్లో వచ్చిన కథనం ఆధారంగా ఎన్జిటి సుమోటోగా కేసు చేపట్టింది. పర్యావరణానికి హాని కలిగించడంతోపాటు ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలుగుతోందంటూ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబయికి రూ.5 కోట్లు జరిమానా విధించింది. తదనంతరం ఎన్జిటికి సుమోటో పరిధి లేదంటూ మున్సిపల్ కార్పొరేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన జస్టిస్ ఎఎం ఖన్విల్కర్, జస్టిస్ ......హషికేశ్రారు, జస్టిస్ సిటి రవి కుమార్లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఎన్జిటికి పరిధి లేదంటూ మున్సిపల్ కార్పొరేషన్ తరపు న్యాయవాదులతో ధర్మాసనం ఏకీభవించ లేదు. ఎన్జిటి కూడా చట్టబద్ధమైన ట్రిబ్యునల్ అని, చట్టబద్ధమైన పరిమితులు ఉంటాయని తెలిపింది. ఎన్జిటి చట్టం-2010కి లోబడి ఎన్జిటికి సుమోటోగా కేసుల చేపట్టే అధికారం ఉందని స్పష్టం చేసింది.