Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేనకాగాంధీపై బీజేపీ వేటు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీపై బీజేపీ వేటు వేసింది. కేంద్ర కమిటీ నుంచి ఆమెను తొలగించింది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటనపై రైతులు చేపడుతున్న ఆందోళనకు మద్దతుగా ఆమె కుమారుడు, ఎంపీ వరుణ్ గాంధీ ట్వీట్లు చేయడంతో మేనకాపై వేటుపడింది. రైతులపై జరిగిన ఈ దారుణఘటన 'తన మనసును కలచివేసింది' అంటూ వరుణ్ గాంధీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. బుధవారం కూడా ఈ విషయంపై స్పందిస్తూ... ప్రమాదానికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ 'వీడియోలో చాలా క్లియర్‌గా కనిపిస్తోంది. రైతులు రక్తం ధారపోశారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?' అంటూ ట్వీట్ చేశారు. గతంలోనూ రైతు ఆందోళనలపై వరుణ్ ట్వీట్ చేశారు. రైతులకు కనీస మద్దతు ధరతో పాటు వారికి కల్పించాల్సిన వసతులపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. కొంత కాలంగా వరుణ్ గాంధీ వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్న బీజేపీ అధిష్టానం.. ఆయన తాజా స్పందనతో మేనకాగాంధీపై వేటు వేసినట్టు తెలుస్తున్ననది.