Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 ఏండ్లుగా అదే స్థానం : ఫోర్బ్స్
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండిస్టీస్ లిమిటెడ్ చైర్మెన్ ముకేశ్ అంబానీ ఫోర్బ్స్ ఇండియా జాబితాలో అత్యంత ధనవంతుల్లో వరుసగా 14వ ఏడాది అగ్ర స్థానంలో నిలిచారు. గతేడాది కాలంలో ముకేశ్ సంపాదన 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.29వేల కోట్లు) పెరిగింది. మొత్తంగా 92.7 బిలియన్ డాలర్ల (రూ.6.95 లక్షల కోట్లు) నికర విలువ కలిగి ఉన్నారు. భారత్లో టాప్ 100 కుబేరుల జాబితాను గురువారం ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ 100 మంది ధనవంతులైన భారతీయుల మొత్తం సంపద ఏడాది కాలంలో 775 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ జాబితాలో గౌతమ్ అదానీ రెండవ స్థానంలో ఉన్నారు. 2020లో అదానీ సంపద దాదాపు మూడు రెట్లు పెరి గింది. 2020లో ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల సంపద మధ్య అంత రం 63.5 బిలియన్ డాలర్లుగా ఉంటే.. అది ఇప్పుడు 17.9 బిలియన్ డాల ర్లకు తగ్గింది. గౌతమ్ అదానీ సంపద 2021లో ఏకంగా 49.5 బిలియన్ డాలర్లు (రూ.3.70లక్షల కోట్లు)పెరిగింది. ఇక మూడోస్థానంలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ శివ్ నాడార్ 31 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్నారు. డిమార్ట్ రిటైల్ చైన్ వ్యవస్థాపకుడు రాధాకష్ణ దమాని నికర విలువ 29.4 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో నిలిచారు.