Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబాలపై పెను భారం
- పండుగ సీజన్లో నిరుత్సాహం
- రూ.1000కి చేరువలో గ్యాస్ బండ
- ఎఫ్ఎంసీడీ ఉత్పత్తులూ ప్రియం
న్యూఢిల్లీ : దేశంలో పేదలు, సామాన్యులపై ధరల భారం అమాంతం పెరుగుతోంది. మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా పెంచడంతో ఆ ప్రభావం ఇతర ఉత్పత్తుల పై తీవ్రంగా పడుతోంది. దీంతో ధరలు దండిగా పెరగడంతో ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోతోంది. వంట గ్యాస్ ధర రూ.1,000 చేరువలో ఎగిసి పడుతోంది. సామాన్యులు చెల్లించే అనేక బిల్లులు భారం అవుతున్నాయి. ఈ పరిణామాల వల్ల గడిచిన కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ప్రభుత్వ విధానాలతో ప్రస్తుతం అనేక వస్తువుల ధరలు తీవ్రరూపం దాల్చడంతో పండుగ సీజన్లోనూ ప్రజల నిరాశకు గురైతున్నారు. కేంద్ర ప్రభుత్వం బుధవారం వంట గ్యాస్‌పై మరో రూ.15 పెంచడంతో హైదరాబాద్‌లో దీని ధర రూ.952కి చేరింది. గడిచిన తొమ్మిది మాసాల్లోనే బీజేపీ ప్రభుత్వం రూ.200పైగా భారం మోపింది. ఈ పెంపు ప్రక్రియ ఇలాగే కొనసాగితే అతి త్వరలోనే ఎల్పీజీ గ్యాస్ ధర రూ.1000కి చేరనుందని స్పష్టమవుతోంది. పెట్రోల్ ధర రూ.110 చేరువలో డీజిల్ ధర రూ.100 చేరువయ్యింది. ఈ ఇంధనాలపై వరుసగా పెంచుతున్న పన్ను రేట్ల వల్ల సరుకు రవాణ వ్యయం అమాంతం పెరుగుతోంది.
సిమెంట్ ధరలు పెరుగొచ్చు..
దేశంలో బొగ్గు కొరత నెలకొంది. దీంతో విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది. మరోవైపు విద్యత్ డిమాండ్ పెరుగుతోంది. ఈ రంగంలో కార్పొరేట్ల ఆధిక్యం, జోక్యం ఎక్కువ అవుతోంది. దీంతో ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి విద్యుత్ చార్జీలను పెంచుకునే పనిలో ఉన్నారు. అదే జరిగితే అనేక కుటుంబాలపై మరింత భారం పడనుందని నిపుణులుహెచ్చరిస్తున్నారు. గడిచిన కొన్ని నెలలుగా దిగుమతి బొగ్గు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని సౌత్ ఇండియా సిమెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సిక్మా) ఓ ప్రకటనలో తెలిపింది. ఒక్కో బ్యాగ్‌పై ఉత్పత్తి వ్యయం రూ.60 పెరుగొచ్చని పేర్కొంది. అంటే ఆ మొత్తాన్ని అతి త్వరలోనే వినియోగదారులపై నెట్టనున్నారు.
రవాణ భారం ప్రభావం..
ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ముడి సరుకులు, కమోడిటీల ధరలు ఇటీవల భారీగా పెరుగుతున్నాయి.
దీనికి తోడు వరుసగా పెరుగుతోన్న ఇంధన ధరలతో రవాణ వ్యయం తడిసిమోపడవుతోంది. దీంతో ఎఫ్ఎంసిజి కంపెనీలు ప్రస్తుత పండుగ సీజన్లోనే ధరల పెంచాలని భావిస్తున్నాయి.
హెచ్‌యుఎల్, నెస్ట్లే, బ్రిటానియా, పెప్సికో, డాబర్ తదితర ఎఫ్ఎంసీజీ కంపెనీలు సబ్బులు, సర్పులు, టూత్పేస్ట్లు తదితర వాటి ధరలను ఇప్పటకే పెంచేశాయి. ఈ ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే ప్రజల కొనుగోలు శక్తి క్షీణించనున్నదనీ.. దీంతో డిమాండ్ పడిపోయి.. ఆర్థిక వ్యవస్థ రికవరీ మందగించనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.