Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలు
- వాహనదారుల జేబులపై మరింత భారం.. కేంద్రంపై ఆగ్రహం
న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజీల్ ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. గురువారం మళ్లీ పెరిగిన చమురు ధరలు వాహనదారులకు చుక్కలు చూపించాయి. రోజురోజుకూ పైపైకి ఎగబాకుతున్న ధరలతో దేశంలోని వాహనదారులతో పాటు సాధారణ ప్రజలూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొం టున్నారు. దీంతో పెట్రో ధరలను అదుపులో ఉంచడంలో విఫలమవుతున్న మోడీ సర్కారు తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలకు అడ్డుకట్టవేసి వాటిని నియంత్రణలో ఉంచాలని డిమాండ్ చేశారు. ఇక తాజాగా లీటర్ పెట్రోల్‌పై 34 పైసలు, డీజీల్‌పై 35 పైసలు పెరిగాయి. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.24కు, డీజీల్ ధర రూ. 91.77కు ఎగబాకింది. దేశ ఆర్థికరాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.25గా, డీజీల్ ధర రూ. 99.55గా రికార్డయ్యింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.94కు, డీజీల్ ధర రూ. 94.88కు పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.86కు, డీజీల్ ధర రూ. 96.37కి ఎగబాకింది. బెంగళూరులో లీటర్పెట్రోల్ రూ.106.83కి, డీజల్ రూ.97.40కు చేరింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 107.40కు పెరిగింది. అలాగే, ఇక్కడ లీటర్ డీజీల్ ధర రూ. 100.13కి చేరింది.