Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులపై దూసుకెళ్లిన బీజేపీ ఎంపీ కాన్వారు
- రైతుకు గాయం అన్నదాతల ఆగ్రహం
ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరి ఘటన మరవకముందే..మరోసారి బీజేపీ ఎంపీ బరితెగించాడు. నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేస్తుండగా..ఎంపీ నాయబ్ సింగ్ సైనీ కాన్వారు అమాంతంగా రైతు భవన్ప్రీత్ పైకి దూసుకెళ్లింది.అప్రమత్తం కావటంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. స్వల్పగాయాలతో బయటపడ్డారు.హర్యానాలోని అంబాలా జిల్లాలోని నారా యణ్గఢ్లో గురువారం జరిగిన ఈ ఘటనతో.. భారీ సంఖ్యలో రైతులు చేరుకున్నారు. పోలీసులు పెద్ద సంఖ్యలో తరలిరావటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హత్య చేయాలనే ఉద్దేశంతో భవన్ప్రీత్ను కొట్టారని రైతు నేతలు ఆరోపిస్తున్నారు.ఎంపీ స్టిక్కర్‌తో వాహనం ఎంపీ నయబ్ సింగ్ సైనీ నారాయ ణగఢ్లో ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చారు. ఆయన వస్తున్నారని తెలియగానే.. రైతులు నల్లజెండాలతో నిరసనకు దిగారు. కార్యక్రమం పూర్తయ్యాక.. సైనీ తన కాన్వారుతో తిరుగుప్రయాణమయ్యాడు. రైతులు కనిపించగానే అత్యంత వేగంగా ఇన్నోవా కారు ( హెచ్ఆర్ 04ఎఫ్ 0976)ను పోనిచ్చాడు.ఆ మార్గంలోనే నిరసనలో ఉన్న భవన్ప్రీత్ను ఢకొీట్టాడు.ఎంపీ డ్రైవర్ రాజీవ్‌పై నారాయణగఢ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఉద్దేశపూర్వకంగా దాడి...గాయపడిన రైతు
తాము నిరసనలో పాల్గొనేందుకు వచ్చామని గాయపడిన రైతు భవన్ప్రీత్ తెలిపారు. చేతిలో నల్ల జెండాతో రోడ్డు పక్కన నిలబడి ఉన్నా. ఎంపీ కాన్వారు కారు డ్రైవర్ అతడిని ఉద్దేశపూర్వకంగా ఢకొీట్టాడు. యూపీలో జరిగిన సంఘటనను హర్యానాలో కూడా పునరావృతం చేయాలని బీజేపీ నాయకులు కోరుకుంటున్నారని ఆయన ఆరోపించారు. నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తుంటే...ఆ ఉద్యమాన్ని దెబ్బతీసేలా మోడీ ప్రభుత్వం మొదలుకుని బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు బరితెగిస్తున్నాయనటానికి తాజాగా జరిగిన ఘటన అద్దంపడుతున్నది.