Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరింత నిరంకుశంగా కేంద్రం, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కార్, పలు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వాల్లో నెలకొన్న నిరాశ నిస్పృహలకు ఇటీవల ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో రైతాంగంపై జరిపిన హత్యాకాండ అద్దం పడుతోంది. తమ ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలపై వ్యక్తమవుతున్న ప్రజాగ్రహాన్ని పలు విధాలుగా అణచివేయాలని అనుకున్న బీజేపీ.. అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు తమ నిరంకుశత్వాన్ని పరాకాష్టకు చేర్చింది. ప్రధానంగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు సంవత్సరం నుంచి కొనసాగుతున్న రైతాంగ ఉద్యమం వచ్చే ఏడాది జరగనున్న యుపి అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరువాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ కుర్చీ ఎక్కడ ఎసరు పెడతాయోనని బీజేపీ పెద్దలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు రైతాంగ పోరాటంలో పాల్గొంటున్న రైతులు, సామాజిక ఉద్యమకారులు, జర్నలిస్టులు.. ఇలా అనేక మందిపై రాజద్రోహం, ఉపా వంటి కేసులు మోపుతున్న బీజేపీ ఇప్పుడు ఏకంగా కార్లతో తొక్కించి, తుపాకులతో కాల్చి చంపే వరకు వెళ్లిందని ఉద్యమకారులు, హక్కుల కార్యకర్తలు, పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు విమర్శిస్తున్నారు. కేసుల పరంగా పోలీసులు, ఈడీ, ఇతర వ్యవస్థలను వినియోగించుకున్న బీజేపీ.. తమ వ్యతిరేకులపై దాడులు చేసేందుకు ప్రైవేటు సైన్యంగా ఏర్పడాలని రెచ్చగొడుతూ పురిగొల్పుతోంది. కేంద్రం తో పాటు పలు రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి గతంలో దేశాన్ని పాలించిన బ్రిటిష్ పాలకుల మాదిరిగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక, రాజకీయ సవాళ్లలో రైతుల ఆందో ళన చాలా బలంగా ఉంది. ప్రభుత్వం దీనిని విచ్ఛిన్నం చేసేందుకు విభజన కుట్రలు, ఇతర ఉపాయాలు చేసినప్పటికీ.. అది మరింత బలపడడంతో పాటు రాజకీయ పార్టీలు, కార్మికులు, ఇతర వర్గాల నుంచి గట్టి మద్దతు కూడగట్టుకుందే తప్ప బలహీనం కాలేదు. తమ అధీనంలోని కార్పొరేట్ మీడి యా ద్వారా ఆందోళనలను తప్పుదారి పట్టించే ప్రయత్నించినా.. సాధ్యం కాకపోవడంతో బీజేపీ పెద్దలకు కంటగింపుగా మారింది. ఇదే సమయంలో బీజేపీ విధానాలపై సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రైతులపై దాడులకు పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. ఈనెల 3న హర్యానా సీఎం ఖట్టర్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ప్రతి జిల్లాలో కార్యకర్తలు ప్రయివేటు సైన్యం (దండ ఫోర్స్)గా ఏర్పడి రైతులపై దాడుల చేయండి అంటూ పిలుపునిచ్చారు. జైలుకు వెళ్తామనే భయం వద్దని, జైలుకు వెళ్తే పెద్ద నేతలవడంతో పాటు చరిత్రలో నిలిచిపోతారని వారిని పురిగొల్పే ప్రయత్నం చేశారు. రైతుల నుంచి హింసాత్మక ప్రతిచర్యను రెచ్చగొట్టేందుకు ఖట్టర్ తొలి నుంచి ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కేంద్రహోంశాఖ సహాయమంత్రి అజరు కుమార్ మిశ్రా కూడా గతనెలాఖరులో మాట్లాడుతూ ఆందోళనల్లో పాల్గొం టున్న రైతులను బహిరంగంగా బెదిరించే ప్రయత్నం చేశారు. 'రెండు నిమి షాల్లో వారిని ఏరివేస్తాం' అంటూ నిరంకుశా ధోరణిలో మాట్లాడారు. వీరి వ్యాఖ్యల తర్వాతనే ఇటీవలి లఖింపూర్ ఖేరి ఘటన చోటుచేసుకోవడం గమ నార్హం. రాజ్యాంగ ప్రమాణాలను కాపాడుతామని ప్రతిజ్ఞ చేసిన సీఎం, మం త్రులు వంటి వ్యక్తులు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే.. ఇక రాజ్యాంగాన్ని, చట్టా లను ఎవరు కాపాడుతారనే ప్రశ్న తప్పక తలెత్తుతుందుని, పౌరుల హక్కు లను ఎవరు కాపాడుతారని విమర్శకులు పేర్కొంటున్నారు. ప్రధాని మోడీ మౌనం వీడి ఈ ఇద్దరు నేతలను వారి పదవుల నుంచి తొలగించాలని అన్ని వైపులా నుంచి డిమాండ్ వస్తోంది. లఖింపూర్ ఘటనపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలంటే, అజరుమిశ్రాను వెంటనే కేంద్ర మంత్రిగా తొలగించడంతో పాటు ఆశిష్ మిశ్రాను అరెస్టు చేయాలని స్పష్టం చేశారు.