Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేర్ ఘటనపై స్పందించాలంటూ సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ శుక్రవారం ప్రధాని మోడీకి చురకలంటించారు. మోడీ గారు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు.. రైతుల మృతిపై ఎందుకు స్పందించటం లేదని కపిల్‌సిబాల్ ప్రశ్నించారు. సానుభూతిగా ఒక్కమాటైనా మాట్లాడాలని.. అది పెద్ద కష్టమేమీ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగితే ఎలా స్పందించేవారో గుర్తు చేసుకోవాలన్నారు. లఖింపూర్ హింసాత్మక ఘటనపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కేంద్రం, యోగి ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఈ ఘటనకు కారణమైన రాష్ట్ర హోంశాఖ సహాయక మంత్రిని రాజీనామా చేయాలని కేంద్రం ఆదేశించలేదనీ.. దీంతో అధికారంలో ఉన్న లేదా మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏదైనా చేయవచ్చనే సందేశాన్ని మోడీ ఇచ్చారని స్పష్టమైందని ప్రియాంక ట్వీట్ చేశారు.