Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలు
న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోని ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులను ఈ నెల 16 నుంచి కార్యాలయాల్లోనికి అనుమతించేదిలేదని ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) స్పష్టం చేసింది. ఉపాధ్యాయులు, ఫ్రంట్లైన్ వర్కర్లతో పాటు వ్యాక్సిన్ తీసుకోని ఇతర ప్రభుత్వ ఉద్యోగులందరు వ్యాక్సిన్ తీసుకునేంత వరకు సెలవులో ఉన్నట్టుగా పరిగణించబడతారని పేర్కొంది. ఈ మేరకు డీడీఎంఏ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తించాలనుకుంటే ఈ నెల 15 నాటికి కనీసం మొదటి డోసు అయినా పొంది ఉండాలని తెలిపింది.
ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకున్నారా? లేదా? అనేది సంబంధిత విభాగాల అధిపతులు ఆరోగ్య సేతు యాప్ లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ద్వారా తెలుసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజరు దేవ్ ఈ ఉత్తర్వుల ద్వారా సూచించారు.
డిల్లీలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా ఇదేవిధమైన ఆదేశాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరారు.