Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండీగఢ్ : డేరా సచ్ఛాసౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబా (డేరా బాబా) మరో హత్య కేసులో దోషిగా తేలాడు. రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా బాబాను హర్యానా సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తీర్పునిచ్చింది. గతంలో ఆయన ఆశ్రమంలో మేనేజర్‌గా పనిచేసిన రంజిత్ సింగ్ 2002, జులై 10న హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో సీబీఐ ప్రత్యే కోర్టు డేరా బాబాతోపాటు మరో నలుగురిని దోషులుగా తేల్చింది. ఈ నెల 12న దోషులందరికీ శిక్షలు ఖరారు చేయనుంది.