Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తెలంగాణలోని డిండి ఎత్తిపోతల పథకం నిలిపివేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. ఈ పిటిషన్ను శుక్రవారం జస్టిస్ రామకష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్లతో కూడిన ధర్మాసనం విచారించింది. తెలంగాణ దాఖలు చేసిన కౌంటరుకు రిజాయిండర్ దాఖలు చేయడానికి ఏపీ ప్రభుత్వం సమయం కోరింది. దీనికి అనుమతించిన ధర్మాసనం నవంబరు 1లోగా అన్ని లిఖితపూర్వక పత్రాలు అందజేయాలని ఆదేశించి అదే రోజుకు విచారణ వాయిదా వేసింది.