Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుసగా నాలుగో రోజూ పైకి ఎగబాకిన ఇంధన ధరలు
- లీటర్ పెట్రోల్‌పై 30, డీజీల్‌పై 35 పైసలు పెరుగుదల
న్యూఢిల్లీ : దేశంలో ఇంధన ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. లీటర్పెట్రోల్పై 30 పైసలు, డీజీల్‌పై 35 పైసల మేర ఎగబాకాయి. దీంతో దేశంలోని పలు నగరాల్లో పెట్రో ధరలు కొత్త రికార్డులను నమోదు చేశాయి. తాజాగా పెరిగిన ధరల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.54, డీజీల్ ధర రూ. 92.12కు ఎగబాకింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.54కు, డీజీల్ ధర రూ. 99.92కు పెరిగింది. దీంతో ఇక్కడ డీజీల్ ధర సెంచరీ మార్కుకు చేరువైంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.23కి, డీజీల్ ధర రూ. 95.23కు చేరి పండుగ సీజన్లో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.01, డీజీల్ ధర రూ. 96.60కు పెరిగింది. కర్నాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.71గా, డీజీల్ ధర రూ.97.77గా నమోదైంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు హీటెక్కిస్తున్నాయి. తాజా పెరుగుదలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.71కి ఎగబాకింది. అలాగే, ఇక్కడ లీటర్ డీజీల్ ధర రూ. 100.51కి పెరిగింది. కాగా, మోడీ సర్కారు వైఫల్యంతో వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు తమ జేబులకు చిల్లులు పెడుతున్నాయని దేశంలోని వాహనదారులు, సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభార్జనే ధ్యేయంగా పెట్రోల్, డీజీల్‌లపై విపరీతమైన పన్నులతో పాటు ఇతర రూపాల్లోనూ ప్రజలపై కేంద్రం భారం మోపుతున్నదని తెలిపారు.