Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండోసారి సమన్లు జారీ
- యూపీ పోలీసులకు చిక్కని కేంద్రమంత్రి తనయుడు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరీలో హింసాత్మక ఘటనకు ప్రధాన బాధ్యుడిగా భావిస్తున్న కేంద్ర హౌంశాఖ సహాయమంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఎక్కడ ఉన్నాడో అంతుచిక్కని మిస్టరీగా మారింది. కారుతో రైతుల్ని ఢకొీట్టి చంపటంతో పాటు...తన గన్‌తో కాల్పులు జరిపాడని గాయపడ్డ రైతులు చెబుతున్నారు. అయితే ఇప్పటికీ యూపీ పోలీసులకు చిక్కలేదు. రెండోసారి సమన్లు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తునకు శుక్రవారం హాజరుకావాలని ఆదేశించినా ఆశిష్ రాలేదు. దీంతో పోలీసులు నేడు మరోసారి సమన్లు జారీ చేశారు.
లఖింపుర్ ఘటనలో ఆశిష్ సహా పలువురిపై హత్యా నేరం కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో కేసు విచారణకు హాజరుకావాలని పోలీసులు సమన్లు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు పోలీస్ లైన్స్‌లోని కార్యాలయానికి రావాలని ఆదేశించారు. అయితే ఒంటి గంట వరకూ ఎదురు చూసినప్పటికీ ఆశిష్ ఆచూకి కనిపించలేదు. దీంతో ఈ మధ్యాహ్నం పోలీసులు మరోసారి సమన్లు జారీ చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు పోలీస్ లైన్స్ కార్యాలయానికి రావాలనీ, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ అజరు మిశ్రా నివాసానికి నోటీసులు అంటించారు. ఇలా ఉండగా.. ఘటన జరిగిన తర్వాత నుంచి ఆశిష్ పరారీలో ఉన్నాడు. పోలీసులకు దొరక్కుండా పలు ప్రాంతాలకు వెళ్తున్నట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అతడి కోసం యూపీ పోలీసులు బృందాలుగా విడిపోయి ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఆశిష్ సంచరించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో అతడు నేపాల్ పారిపోయి ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్రమంత్రి తనయుడు కావటం, యూపీలో బీజేపీ ప్రభుత్వం ఉండటంతో..ఆశిష్‌ను అండర్‌గ్రౌండ్‌లోకి తరలించి ఉండొచ్చని రైతునేతలు ఆరోపిస్తున్నారు.