Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ)గా ఉన్న క్రిష్ణమూర్తి సుబ్రమణ్యన్ వైదొలగనున్నారు. వచ్చే డిసెంబర్6తో ఆయన పదవీ కాలం ముగియనుండటంతో ఆ హోదా నుంచి దిగిపోతున్నట్టు తెలిపారు. తిరిగి అధ్యాపక వృత్తిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 12 నుంచే 2022-23 బడ్జెట్ కసరత్తు ప్రారంభమైన నేపథ్యంలో కొత్త సీఈఏ ఎంపిక ప్రక్రియను కేంద్రం ప్రారంభించనుందని సమాచారం. నూతన నియామకం డిప్యూటేషన్ పద్దతిలో జరిపేందుకు దరఖాస్తులను స్వీకరించనుంది. 2018 డిసెంబర్7న సీఈఏగా సుబ్రమణ్యన్ బాధ్యతలు స్వీకరించారు. అంతక్రితం ఈ హోదాలో పని చేసిన అర్వింద్ సుబ్రమణ్యన్ మోడీ సర్కార్‌తో పొసగలేక అర్ధంతరంగా మానేశారు.