Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 వేల కోట్లకు అమ్మకం.. ఏఐను బలిపెట్టిన బీజేపీ
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం అనుకున్నట్లుగానే ఎయిరిండియాను ప్రయివేటుపరం చేసింది. ఈ ప్రభుత్వ రంగసంస్థను టాటా గ్రూపునకు కట్టబెడుడూ నిర్ణయం తీసుకుంది. కేవలం రూ.18,000 కోట్లకే అప్పగించేస్తూ కేంద్రం శుక్రవారం కీలకప్రకటన చేసింది. నష్టాల సాకుతో 2020లో 100శాతం వాటాల ఉపసంహరణకు బీజేపీ ప్రభుత్వం బిడ్లను అహ్వానించింది. దీని కొనుగోలుకు స్పైస్ జెట్‌తో పాటు టాటా గ్రూపు కూడా బిడ్‌ను దాఖలు చేసింది. రెండు బిడ్లను పరిశీలించిన కేంద్ర మంత్రుల బందం చివరకు టాటా సన్స్‌కు స్వాధీనం చేయాలని నిర్ణయించింది. దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఏఐను స్వాధీనం చేసుకోవడానికి టాటా సన్స్ రూ. 18,000 కోట్లకు, స్పైస్‌జెట్ అధినేత అజరు సింగ్ రూ.15,100 కోట్లకు బిడ్డింగ్ వేశారు.68 ఏండ్ల క్రితం 1932లో టాటా సన్స్ అధినేత జహంగీర్ రతన్ జీ దాదాబారు టాటా దీన్ని ప్రారంభించగా దేశ ప్రయోజనాల దృష్ట్యా 1953లో దీన్ని జాతీయికరణ చేశారు. మహారాజా మస్కట్‌తో ఈ సంస్థ ఎంతో ప్రాచుర్యం పొందింది. 2000 ఏడాది వరకు ఈ సంస్థ మెరుగైన లాభాల్లోనే కొనసాగింది. 1999లో అటల్ బిహారి వాజ్‌పేరు ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ సంస్థను నీరుగార్చడం ప్రారంభించింది. విజయ మాల్యకు చెందిన కింగ్ ఫిషర్ విమానయాన సంస్థకు లాభాల్లోచ్చే రూట్లను అప్పగించడం,ఎయి రిండియా(ఏఐ)కు పలు అనుమతుల ను జాప్యం చేయడం లాంటి చర్యలతో ఈ సంస్థను నష్టాల వైపు మళ్లించినట్టయింది. తిరిగి ప్రధాని మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఐ ప్రయివేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా తిరిగి టాటా గ్రూపునకే దీన్ని అప్పగించింది.దీనిపై రతన్ టాటా ట్విట్టర్లో స్పందిస్తూ.. ''ఎయిరిండియాకు తిరిగి స్వాగతం. విమానయాన పరిశ్రమలో టాటా గ్రూప్‌కు ఇది చాలా బలమైన మార్కెట్ అవకాశాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను .ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కతజ్ఞతలు.'' అంటూ పేర్కొన్నారు. ఎయిరిండియా బిడ్‌ను గెలుచుకున్న టాటాగ్రూప్‌నకు స్పైస్‌జెట్ చైర్మెన్ అజరు సింగ్ అభినందనలు తెలిపారు.