Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై దోపిడీ దొంగలు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన లక్నో-ముంబయి పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైల్లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్లీపర్ కోచ్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై ఎనిమిది మంది దోపిడీ దొంగలు కత్తులతో బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ కోచ్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల నుంచి నగదు, ఆభరణాలను అపహరించారు. దొంగల దాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురై గట్టిగా అరవడంతో రైలును ముంబయిలోని కాసరా స్టేషన్ వద్ద ఆపేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆ కోచ్ వద్దకు చేరుకుని ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. ఆ తర్వాత మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొంగల నుంచి రూ.34 వేల నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.