Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశ్రమల స్టాండింగ్ కమిటీ చైర్మెన్ గా కే.కేశవరావు
- వాణిజ్య శాఖ స్టాండింగ్ కమిటీ చెర్మెన్ గా విజయసాయి రెడ్డి
- కీలక కమిటీల్లో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు చోటు
న్యూఢిల్లీ : పరిశ్రమల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మెన్‌గా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు , వాణిజ్య శాఖ కమిటీ చైర్మెన్ గా వైసీపీ ఎంపి విజయ సాయి రెడ్డి, మరోసారి నియమితులయ్యారు. 24 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు చైర్మెన్లు, సభ్యులను నియమిస్తూ శనివారం రాజ్యసభ సెక్రెటరీ జనరల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. 2021-22 సంవత్సరానికి ఈ కమిటీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి డి శ్రీనివాస్, డి అర్వింద్, నామా నాగేశ్వర్ రావులకు అవకాశం దక్కింది. పరిశ్రమల కమిటీ చైర్మన్ గా కేకే(తెలంగాణ), సభ్యుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి(ఏపీ)లు నియమితులయ్యారు. వాణిజ్య శాఖ స్టాండింగ్ కమిటీలో చైర్మెన్ గా విజయసాయి రెడ్డి వరుసగా మూడోసారి నియమితులయ్యారు. ఆ కమిటీ సభ్యులుగా ఏపీ నుంచి కేశినేని నాని, రవాణా, పర్యటక కమిటీ చైర్మెన్ గా టిజి వెంకటేష్(ఏపీ), సభ్యుడిగా మార్గాని భరత్(ఏపీ)లు ఉన్నారు. పట్టణాభివృద్ధి కమిటీలో సభ్యులుగా ఏపీ నుంచి సుజనా చౌదరి, అదాల ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ నుంచి బండి సంజరు లకు అవకాశం దక్కింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమం కమిటీలో సభ్యులుగా మాలోతు కవిత(తెలంగాణ), హౌం వ్యవహారాల కమిటీలో పోతుగంటి రాములు(తెలంగాణ), వంగ గీత(ఏపీ) లు ఉన్నారు.