Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని కవర్ధా పట్టణంలో చోటుచేసుకున్న మత హింసకు సంబంధించి బీజేపీ ఎంపీ సంతోష్ పాండే, మాజీ ఎంపీ అభిషేక్ సింగ్‌లపై అల్లర్లు, ఆస్తి నష్టంపై కేసు నమోదైందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అభిషేక్ సింగ్ ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కుమారుడు. ఈ నెల 5న కబీర్ధామ్ జిల్లా కేంద్రమైన కవర్ధాలో కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘిస్తూ పలు హిందూ సంస్థలకు చెందిన దాదాపు 3 వేల మంది ప్రజలు ఊరేగింపు చేస్తున్న సమయంలో హింస చెలరేగింది. పట్టణంలోని ఒక రహదారి వెంట ఉన్న మత జెండాలను తొలగించిన విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల తర్వాత పలు హిందూ సంస్థలు ర్యాలీ చేపట్టాయి. అయితే, ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 66 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా, ర్యాలీలో పాల్గొన్నవారు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ముస్లింల ఇండ్లు, వాహనాలపై దాడి చేశారు.
ఈ క్రమంలోనే పోలీసులపై కూడా వారు దాడికి పాల్పడ్డారు. దీంతో పదుల సంఖ్యలో పౌరులు, పోలీసులు గాయపడ్డారు. రాష్ట్ర రాజధాని రారుపూర్‌కు 126 కిలోమీటర్ల దూరంలో ఉన్న కవర్ధాలో ఈ ఘటనలు చోటుచేసుకోవడంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నారు. ''అల్లర్లకు సంబంధించి ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ర్యాలీలో పాల్గొని హింస చెలరేగేందుకు కారణమైన పవులురు వ్యక్తులు, వివిధ సంస్థల నాయకులతో పాటు బీజేపీ నేతలు సంతోష్ పాండే, అభిషేక్ సింగ్‌లపై కూడా కేసు నమోదుచేశాం'' అని పోలీసు సూపరింటెండెంట్ మోహిత్ గార్గ్ వెల్లడించారు. అల్లర్ల వ్యవహారం సున్నితత్వం దృష్ట్యా ఎఫ్ఐఆర్ బహిరంగపరచలేదని తెలిపారు.