Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొలిజియం సిఫారసులకు రాంనాథ్కోవింద్ గ్రీన్ సిగల్
- 13 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు
రాష్ట్రపతి ఆమోద ముద్ర
న్యూఢిల్లీ : తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ,ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది. దేశవ్యాప్తంగా 13 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు నియామకానికి రాష్ట్రపతి పచ్చజెండా ఊపారు. సెప్టెంబరు 16న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని సుప్రీం కోర్టు కొలిజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినట్టు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.