Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్షల కోట్ల విలువైన ఎయిర్ ఇండియా..
- రూ.2,700కోట్లకు అమ్మేశారు : సీఐటీయూ
న్యూఢిల్లీ : లక్షల కోట్ల రూపాయల ఆస్తులు, అంతకుమించిన మానవ వనరులు, వందల కొలది విమానాలు కలిగిన 'ఎయిర్ ఇండియా'ను కేవలం 2700కోట్లకు మోడీ సర్కార్ గంపగుత్తగా అమ్మేసిందని సీఐటీయూ(సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్) ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ సంపద, ప్రజల ఆస్తి అయిన 'ఎయిర్ ఇండియా'ను టాటా గ్రూప్‌నకు అప్పజెప్పటాన్ని సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. దీని వెనుక పెద్ద మోసముందని, బడా కార్పొరేట్లు, పాలకుల మధ్య తెరవెనుక సంబంధాలున్నాయని సీఐటీయూ ఆరోపించింది. లక్షల కోట్ల రూపాయల ప్రజల డబ్బుతో అభివృద్ధి చేసి, అప్పు ల ఊబిలో కూరుకుపోయిందనే సాకుతో కార్పొరేట్లకు కట్టబెట్టారని తెలి పింది. మోడీ సర్కార్ చర్యల్ని కార్మికలోకం అడ్డుకోవాలని, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని సీఐటీయూ పిలుపునిచ్చింది. ఈమేరకు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఈ విధంగా ఉన్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని మంత్రుల బృందం 'ఎయిర్ ఇండియా' అమ్మకం ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది. అంతేగాక ఇతర ప్రభుత్వ సంస్థల్లో ఎయిర్ ఇండియా వాటాల్ని సైతం 100శాతం టాటా గ్రూప్‌నకు అమ్మేశారు. రూ.18వేల కోట్లకు టాటా గ్రూప్ కొనుగోలు చేసినట్టు చెబుతున్నా, వాస్తవానికి ఇక్కడ టాటా చెల్లిస్తున్న నగదు మొత్తం రూ.2,700కోట్లు మాత్రమే ఉందని తేలింది. మిగతామొత్తం (రూ.15,300) కోట్లు అప్పులుగా టాటా గ్రూప్‌నకు బదిలీ అయ్యాయి. ఎయిర్ ఇండియా అభివృద్ధి కోసం అనేక దశాబ్దాలుగా ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇది కాకుండా దాదాపు రూ.62వేల కోట్లు అప్పులు చేసి సంస్థ కోసం ఖర్చుచేసింది. వీటి ద్వారా సంస్థకు దేశ విదేశాల్లో ఆస్తులు, వందలాది విమానాలు, శిక్షణ పొందిన సిబ్బంది సమకూరారు. ఎంతో విలువైన ఎయిర్ ఇండియాను కేవలం రూ.18వేలకు లెక్కగట్టి అప్పనంగా టాటా గ్రూప్‌నకు మోడీ సర్కార్ అప్పజెప్పింది.
ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకం
కేవలం రూ.2700కోట్లకు అమ్మడమంటే..ఇంతకంటే దారుణమైన ఒప్పందం మరోటి ఉండదని సీఐటీయూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బడా కార్పొరేట్లు, కేంద్రంలోని పాలకుల మధ్య తెరవెనుక సంబంధాలకు 'ఎయిర్ ఇండియా' అమ్మకపు ఒప్పందం ఒక తాజా ఉదాహరణ. ఎంతో విలువైన ప్రభుత్వ రంగ సంస్థను అత్యంత చవకగా కార్పొరేట్లకు కట్టబెట్టారు. ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న 12,085 మంది, ఎయిర్ ఇండియాలోని 1434 మంది పర్మినెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సంవత్సరం తర్వాత టాటా గ్రూప్ ఎవర్నైనా ఉంచొచ్చు, తీసేయెచ్చు. దేశ వనరుల్ని, సంపదను తెగనమ్మేస్తున్న మోడీ సర్కార్ చర్యల్ని అడ్డుకోవాలని కార్మికులకు సీఐటీయూ పిలుపునిచ్చింది.