Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లఖింపూర్ హంతకుడి లొంగుపాటు
- 11 గంటలపాటు విచారణ..
- సహకరించలేదన్న పోలీసులు
లక్నో : లఖింపుర్ కేరి హింసాత్మక ఘటనలో నిందితుడిగా భావిస్తున్న కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అరెస్టయ్యారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు శనివారం రాత్రి 11 గంటలకు ఆశిష్ మిశ్రాను అరెస్టు చేశారు. ఈ నెల 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతిచెందారు. అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు చనిపోయారు. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనమైంది. రైతుల మృతిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో ఆశిష్ మిశ్రా పేరును పోలీసులు చేర్చారు. ఇందులో భాగంగా ఈ హింసాత్మక ఘటనకు సంబంధించి ఆశిష్ మిశ్రా విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే శుక్రవారమే అతడు పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉండగా, అనారోగ్య కారణాలతో హాజరుకాలేకపోయాడని ఆయన తండ్రి కేంద్రమంత్రి అజరు మిశ్రా తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట ఆశిష్ హాజరయ్యారు. దీంతో పోలీసులు అశిష్ మిశ్రాను 11 గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం అరెస్ట్ చేశారు. అయితే విచారణలో ఆశిష్ మిశ్రా సహకరించలేదని పోలీసులు తెలిపారు. మేం అడిగిన ప్రశ్నలకు అతను సరైన సమాధానాలు ఇవ్వలేదన్నారు. ఆశిష్ మిశ్రాను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
స్కూటర్‌పై...
లఖింపూర్ ఖేరీ హంతకుడైన కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా శనివారం ప్రత్యేక విచారణ బృందం (సిట్) ముందు విచారణకు హాజరయ్యారు. సదర్ ఎమ్మెల్యే యోగేష్ వర్మ స్కూటర్‌పై ఆశిష్ మిశ్రా లఖింపూర్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి చేరుకున్నారు. పెన్ డ్రైవ్‌లో తన వెంట తెచ్చుకున్న వీడియోలను ఆయన సిట్‌కు అందజేశారు. ఫోన్ కూడా పోలీసు వద్ద ఉంది. సంఘటన జరిగిన సమయంలో తను మరొక చోట ఉన్నానని చెప్పాడు. అలాగే కేసు నమోదు చేసిన తరువాత, ఎక్కడ ఉన్నావని పోలీసులు కూడా అడిగారు. ఎవరిని కలిశావు? ఫోన్ ఎందుకు స్వీచ్ ఆఫ్ చేశావు? కేసుకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షులను కలిశావా? వంటి ప్రశ్నలు సిట్ వేసింది. ఆశిష్ మిశ్రా ఇచ్చిన వీడియోలు, సమాధానాలను సిట్ బృందం విశ్లేషించింది. ఆశిష్ మిశ్రా అక్టోబర్ 3 ఆచూకీని అందించడంలో విఫలమయ్యారు. ఆశిష్ మిశ్రా అక్టోబర్ 3 మధ్యాహ్నం 2:36 గంటల నుంచి 3:30 గంటల వరకు తన ఆచూకీని గురించి రుజువు చేయలేకపోయాడు. ఆయన సమాధానాలపై సిట్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
అతనే డ్రైవ్ చేశాడు..
ఆశిష్ మిశ్రా సమాధానంతో సిట్ సంతృప్తి చెందలేదు. అందువల్ల అతడిని అరెస్టు చేయవచ్చు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఆశిష్ ఎస్యూవీ థార్‌ను నడిపాడు. మరణించిన డ్రైవర్ హరియోమ్ ఎస్‌యూవీని నడుపుతున్నాడనీ, పసుపు చొక్కా ధరించాడని ఆశిష్ చెప్పాడు. అయితే ఎస్‌యూవీని నడుపుతున్న వ్యక్తి తెల్ల చొక్కా ధరించాడనీ, పసుపు చొక్కా కాదని పోలీసులు చెప్పారు.
రైతులపై దూసుకెళ్లిన కారు కేంద్రమంత్రిదే....
రైతులపై దూసు కెళ్లిన కారు కేంద్ర మంత్రి అజరు మిశ్రాదేననీ, దానికి ఇన్సురెన్సు కూడా చేయలేదని స్పష్టం అయింది. లఖింపూర్ ఖేరీ హింసలో రైతులను ఢకొీట్టిన కారుకు ఇన్సూరెన్స్ చేయలేదని గుర్తించారు. బీమా గడువు 2018 జులై 13తో ముగిసింది.కేంద్ర మంత్రి కుమారుడు సిట్ ముందు హాజరవ్వడంతో పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్వోతి సింగ్ సిద్ధూ తన నిరహార దీక్ష విరమించాడు. కేంద్ర మంత్రి అజరు మిశ్రాను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కేంద్ర హౌం మంత్రి అమిత్ షా నివాసం ఎదుట యుత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. నిరసన చేసిన యుత్ కాంగ్రెస్ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం మౌనం పాటించాలని కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది. హౌం సహాయ మంత్రి అజరు మిశ్రాను తక్షణమే తొలగించాలని, అతని కుమారుడితో సహా నిందితులందరిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మౌన ధీక్ష (మౌన ప్రతిజ్ఞ) పాటించాలని కాంగ్రెస్ అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల కమిటీలకు పిలుపు ఇచ్చింది.నిందితుడు శక్తివంతుడు కాబట్టి, అతడిని ప్రభుత్వం రక్షించిందని ఎస్ఏడీ ఎంపీ,కేంద్ర మాజీ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ అన్నారు.
కేంద్ర మంత్రి అజరు మిశ్రాను తొలగించాలని, అతని కొడుకును తక్షణమే అరెస్టు చేయాలని, సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
నేడు యూపీలో కిసాన్ మహా పంచాయితీ
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ జిల్లాలోని ఉదగి గ్రామంలో నేడు (ఆదివారం) జరగనున్న అలహాబాద్ కిసాన్ మహా పంచాయితీకి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ కిసాన్ మహా పంచాయితీ మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, లఖింపూర్ ఖేరీ రైతుల హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేయడమే కాకుండా రాతి క్వారీ కార్మికులు, ఇసుక కార్మికుల జీవనోపాధి సమస్యలను లేవనెత్తుతుంది.
మహారాష్ట్రలో రైతు నేతపై దాడి : ఎస్కేఎం
మహారాష్ట్రలోని సక్రి ధూలేలో ఆల్ ఇండియా కిసాన్ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు సుభాష్ కాకుస్తే (69)పై దాడిని ఎస్కేఎం ఖండించింది. సక్రిలోని ఆయన నివాసంలో ముసుగు వేసుకున్న గుర్తు తెలియని గూండాలు అతనిపై దాడి చేశారు