Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గువహతి : అసోం, మేఘాలయ అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఇరురాష్ట్రాలకు చెందిన మంత్రులు ఆదివారం ఉమ్మడి పర్యటన చేపట్టారు. రెండు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునే చర్యల్లో భాగంగా ఈ పర్యటన చేసినట్లు అధికారులు తెలిపారు. అసోం నీటి వనరుల శాఖ మంత్రి పిజుష్ హజారికా, ఎమ్మెల్యే అటుల్ బోరా, మేఘాలయ డిప్యూటీ సిఎం ప్రెస్టోన్ త్యాన్సోంగ్లతో పాటు ఇరురాష్ట్రాల సీనియర్ అధికారులు పిలింగ్కటా, గణేష్‌నగర్, మైఖులి, పతర్కుచి, ఖనాపరా ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు స్థానిక ప్రజలతో మాట్లాడి సరిహద్దు సమస్యలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.