Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగేయాసియా దేశాలను కోరిన డబ్ల్యూహెచ్ఓ
న్యూఢిల్లీ : ఆగేయాసియాలోని దేశాలు ప్రజలందరి కోసం మెంటల్ హెల్త్ కేర్‌పై తప్పక దృష్టిసారించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కోరింది. పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ సేవలను బలోపేతం చేయాలని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారితో తీవ్రమైన అంతరాలను పూడ్చాలని సూచించింది. ఆదివారం 'వరల్డ్ మెంటల్ హెల్త్ డే' సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ ఈ మేరకు ఆగేయాసియా దేశాలకు పిలుపునిచ్చింది. '' తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో మానసిక సమస్యలతో నివసించే ప్రజల్లో చాలా మందికి తగిన వైద్యం అందదు. కోవిడ్-19 మహహ్మారి మనం ఎదుర్కొంటున్న సవాళ్లను మరింత తీవ్రం చేసింది'' అని డబ్ల్యూహెచ్ఓ ఆగేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేట్రపాల్ సింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి క్రిటికల్ మెంటల్ హెల్త్ సర్వీసులు నిలిచిపోవడం లేదా వాటికి అంతరాయాలు ఏర్పడటం వంటివి జరిగాయని డబ్ల్యూహెచ్ఓ వివరించింది.