Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్కూల్స్లో బ్రేక్ఫాస్ట్.. అందిస్తామని 2018లో కేంద్రం ప్రకటన
- నిధుల్లేక అమలు చేయలేకపోతున్నాం : కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ : పాలకులు తమ వాగ్దానాలతో ప్రజల్ని ఎలా మభ్యపెడుతున్నారో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. మూడేండ్ల క్రితం..2018లో దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం(బ్రేక్ఫాస్ట్) అందిస్తామని మోడీ సర్కార్ ఘనంగా ప్రకటించింది. మూడు సంవత్సరాలు గడిచాక నిధులు సరిపడా లేవు, పథకాన్ని అమలుజేయలేక పోతున్నామని నేడు చేతులెత్తేసింది. ఇప్పటికీ పథకంపై తాము సానుకూలంగానే ఉన్నామని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల ప్రకటించటం వార్తల్లో నిలిచింది. అలాగే మధ్యాహ్న భోజన పథకం పేరు మారుస్తూ..'పీఎం పోషణ్'గా అమల్లోకి తెస్తోంది. బ్రేక్ఫాస్ట్ పథకంపై కేంద్ర విద్యాశాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, '' పీఎం పోషణ్ పథకంలో బ్రేక్ఫాస్ట్ లేకపోవడానికి ప్రధాన కారణం నిధుల కొరతే. అయినప్పటికీ దానిని అమలుజేయాలని భావిస్తోంది'' అని అన్నారు. మధ్యాహ్న భోజన పథకంపై అధ్యయనం కోసం మోడీ సర్కార్ 2018లో ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో 38శాతానికిపైగా ఖాళీ కడుపు తో పాఠశాలకు వస్తున్నారని ఈ కమిటీ గుర్తించింది. ఉదయం ఏమీ తిన కుండా మధ్యాహ్నం వరకూ ఉండటం పిల్లల్లో పౌష్టికాహార సమస్యకు కారణ మవుతుంది. ఇది విద్యార్థుల విద్యా నైపుణ్యాలపై ప్రభావం చూపుతుందని, బ్రేక్ఫాస్ట్ పథకం అమలుజేయాలని కమిటీ ప్రతిపాదించింది. కమిటీ ప్రతిపాదనలు ఆమోదించిన కేంద్రం, బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. అయితే మూడేండ్లుగా నిధులు మాత్రం కేటాయించలేదు. మధ్యాహ్న భోజన పథకానికి నిధుల సమస్య ఉందని చెబుతోంది.