Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీటరు పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెంపు
- దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్ రూ.100కు పైనే
న్యూఢిల్లీ: దేశంలో చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు వాహనదారుల నడ్డివిరుస్తున్నాయి. ఆరుసగా ఆరో రోజు సైతం చమురు కంపెనీలు ఇంధన ధరలను పెంచాయి. ఆదివారం లీటరు పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పను పెంచాయి. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధాని ప్రాంతాల్లో లీటరు పెట్రోల్ ధర సెంచరీ దాటింది. డీజిల్ ధరలు సైతం పలు ప్రాంతాల్లో లీటరుకు రూ.100 దాటగా, మరికొన్ని ప్రాంతాల్లో సెంచరీకి చేరువయ్యాయి. దేశరాజధాని ఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.104.14కు చేరగా, డీజిల్ ధర రూ.92.82కు పెరిగింది. ఇప్పటివరకు ఢిల్లీలో నమోదైన ధరల్లో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధరలే అత్యధికమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.