Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఫేస్బుక్ విజిల్‌బ్లోయర్' ఫ్రాన్సెస్ హౌగెన్
న్యూఢిల్లీ : భారత్‌లో ఆరెస్సెస్ సంబంధ ఫేస్బుక్ ఖాతాలపై 'ఫేస్బుక్ విజిల్ బ్లోయర్' ఫ్రాన్సెస్ హౌగెన్ షాకింగ్ నిజాలు బహిర్గతం చేశారు. ఆ ఖాతాలు 'విద్వేషాన్ని, భయాన్ని, ఒక మతానికి వ్యతిరేకంగా కథనాలను ప్రోత్సహించాయని తెలిపారు. ఈ మేరకు ఆమె పలు రిఫెరెన్స్లను క్రోడీకరించారు. కాగా, హిందీ, బెంగాలీ భాషల ఎడిటర్ల కొరత కారణంగానే ఫేస్బుక్ వేదికపై అలాంటి ద్వేషపూరిత కథనాలు, ప్రసంగాలు పరిశీలనకు నోచుకోలేదని హౌగెన్ వెల్లడించడం గమనార్హం. ఒక వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఆరెస్సెస్ యూజర్లు, గ్రూపులు, పేజీలు హింసాత్మక కథనాలను ప్రోత్సహించాయి. ముఖ్యంగా, ఒక మతంవారిని దారుణంగా కించపరుస్తూ వారి గురించి తప్పుడు వార్తలు, కథనాల ప్రచారం జరిగింది.