Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశిష్ మిశ్రా మూడు రోజుల పోలీస్ రిమాండ్
- అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించకపోవడం సిగ్గుచేటు: ఎస్‌కెఎం
న్యూఢిల్లీ : నేడు దేశవ్యాప్తంగా షహీద్ కిసాన్ దివస్‌గా జరగనున్నది. లఖింపూర్ ఖేరీ మారణకాండ అమరవీరుల సంస్మరణ సభ టికునియాలో సాహెబ్జాదా ఇంటర్ కాలేజీలో జరగనుంది. దీనికోసం సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ సంస్మరణ సభలో పదివేల మందికిపైగా రైతులు పాల్గొననున్నారు. ఎస్కేఎం దేశవ్యాప్తంగా ప్రార్థన, నివాళి సమావేశాలను నిర్వహించడం ద్వారా షహీద్ కిసాన్ దివాస్‌ను జరుపుకోవాలని రైతు సంఘాలకు, ఇతర ప్రగతిశీల సంఘాలకు విజ్ఞప్తి చేసింది. ఎస్కేఎం పిలుపు మేరకు సాయంత్రం కొవ్వొత్తి వెలుగు జాగరణలు, ప్రదర్శనలు జరుగుతాయి. మంగళవారం రాత్రి 8 గంటలకు తమ ఇండ్ల వెలుపల ఐదు కొవ్వొత్తులను వెలిగించాలని ఎస్కేఎం ప్రజలకు సూచించింది.
అజరు మిశ్రాను పదవి నుంచి తొలగించకపోవడం సిగ్గుచేటు
అజయ్ మిశ్రాను ఇంకా పదవి నుంచి తొలగించకపోవడం మోడీ ప్రభుత్వం సిగ్గుచేటని సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది. లఖింపూర్ ఖేరీ సంఘటనల కారణంగా అతని పాత క్రిమినల్ కేసుల చరిత్ర ప్రజల దృష్టికి వచ్చిందని, లఖింపూర్ ఖేరీ మారణకాండలోనే అతడి పాత్ర ఉందని స్పష్టమైందని తెలిపింది.
ఆశిష్ మిశ్రా మూడు రోజుల పోలీస్ రిమాండ్
లఖింపూర్ ఖేరిలోని సెషన్స్ కోర్టులో విచారణ తర్వాత, ఆశిష్ మిశ్రాని మూడు రోజుల పోలీసు రిమాండ్‌కు పంపారు. యూపీ సిట్ 14 రోజుల కస్టడీని కోరింది. మరోవైపు లఖింపూర్ ఖేరీలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇంటర్ నెట్ నిలివేశారు. 144 సెక్షణ విధింపు కూడా కొనసాగుతున్నాయి. పోలీసులను, పారామిలిటరీ దళాలు భారీగా మోహరించాయి. లఖింపూర్ ఖేరీ వెళ్లకుండా రైతు నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
మహారాష్ట్రలో బంద్ విజయవంతం
లఖింపూర్ ఖేరిలో రైతుల హత్యలను ఖండిస్తూ మహారాష్ట్రలో అధికార మహా వికాశ్ అగాధి ప్రభుత్వం తలపెట్టిన రాష్ట్ర బంద్ విజయవంతం అయింది. శాంతియుంగా బంద్ జరిగింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. అత్యవసర సేవలు మాత్రం యాథతధంగా కొనసాగాయి. ఎక్కడిక్కడే అన్ని నిలిపివేశారు. దుకాణాలు మూసివేశారు. మరోవైపు బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. హర్యానాలోని జింద్‌లో బీజేపీ వర్క్‌షాప్‌కు వ్యతిరేకంగా నిరసన జరిగింది. దాంతోపాటు జింద్-పానిపట్ జాతీయ రహదారిలో బీజేపీ నేతలకు వ్యతిరేకంగా కార్యక్రమం జరిగింది.