Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురు జవాన్లు మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో భద్రతా బలగాలకు-ఉగ్రవాదులకు మధ్య చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ఒక జూనియర్ కమిషన్డ్ అధికారితో పాటు మరో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. పూంచ్ జిల్లాలోని నియంత్రణా రేఖ వెంబడి ఉన్న సురాన్ కోట్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముటాయి. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపాయి. తీవ్రంగా గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుండగా, బందీపొరాలోని హజిన్ ప్రాంతంలో సోమవారం ఉదయం సైనికులు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. అతడు లష్కరే తొయిబాకు చెందిన ఇంతియాజ్ అహ్మద్ దార్గా గుర్తించారు. అలాగే, అనంత్‌నాగ్ జిల్లాలో మరో గుర్తు తెలియని ఉగ్రవాదిని హతమార్చారు.