Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడో రోజూ పెరిగిన పెట్రో ధరలు
- లీటర్ పెట్రోల్‌పై 30, డీజీల్‌పై 35 పైసలు పెంపు
న్యూఢిల్లీ : దేశంలో పెట్రో వడ్డన కొనసాగుతున్నది. వరుసగా ఏడో రోజూ దేశవ్యాప్తంగా చమురు ధరలు పైకి ఎగబాకాయి. దీంతో పలు నగరాల్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు, డీజీల్‌పై 35 పైసల మేర ధరలు పెరిగాయి. పెరిగిన ఇంధన ధరలతో వాహనదారులు, సామాన్యులపై ఆర్థికంగా భారం పడుతున్నది. దీంతో ధరలు నియంత్రించడంలో విఫలమవుతున్న కేంద్ర ప్రభుత్వంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలను అదుపులో ఉంచాలని మోడీ ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.
తాజా ధరల ప్రకారం.. దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.44కు, డీజీల్ ధర రూ. 93.17కు పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.41గా, డీజీల్ ధర రూ. 101.03కు ఎగబాకింది. దేశంలోని నాలుగు ప్రధాన నగరాల (ఢిల్లీ, చెన్నై, ముంబయి, కోల్‌కతా) తో పోల్చుకుంటే పెట్రోల్, డీజీల్ ధరలు ఇక్కడే అత్యధికం కావడం గమనార్హం. దీంతో పెరిగిన ఇంధన ధరలు ఇక్కడి వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.09, డీజీల్ ధర రూ. 96.28గా నమోదైంది. కర్నాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.08కి, డీజీల్ ధర రూ. 98.89కి పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.79కి ఎగబాకింది. ఇక్కడ డీజీల్ ధర రూ. 97.59కి చేరింది.
హైదరాబాద్‌లోనూ పెట్రో ధరలు వాహనదారులకు మంట పుట్టిస్తున్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్‌పై 31 పైసలు ఎగబాకి దాని ధర రూ. 108.64కు పెరిగింది. అలాగే, లీటర్ డీజీల్‌పై 39 పైసలు పెరిగి దాని ధర రూ. 101.66కు ఎగబాకింది.