Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : రానున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పి)తో పొత్తు పెట్టుకోడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ (పిఎస్పి) అధ్యక్షులు శివపాల్ యాదవ్ తెలిపారు. ఇతర లౌకిక పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశాలను ఆయన పూర్తిగా తోసిపుచ్చలేదు. '2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీతో పొత్తుకే మేం తొలి ప్రాధాన్యత ఇస్తాం. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఓడించే లక్ష్యం కోసం లౌకిక భావజాలం కలిగిన ఏ పార్టీతోనైనా మేం పొత్తు పెట్టుకుంటాం' అని బుధవారం విలేకరులకు యాదవ్ తెలిపారు. అఖిలేష్ యాదవ్‌తో విభేదాల నేపథ్యంలో 2018లో ఎస్పి నుంచి బయటకు వచ్చిన శివ్‌పాల్ యాదవ్ పిఎస్పి పార్టీని పెట్టుకున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యమని, ఒక్క హామీని కూడా బిజెపి ప్రభుత్వం నెరవేర్చలేదని శివపాల్ యాదవ్ విమర్శించారు.