Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోని 26 సమాచార కమిషన్లో 2.5 లక్షల అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. ఈ మేరకు సతర్క్ నగ్రిక్ సంగతన్ (ఎస్ఎన్ఎస్) సామాజిక సంస్థ తెలిపింది. జూన్ 30 నాటికి 2.55 లక్షల అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. ఆర్టీఐ ద్వారా పొందిన సమాచారం ప్రకారం 13 కమిషన్లలో ఫిర్యాదులను పూర్తి చేసేందుకు ఏడాది సమయం పడుతుందని పేర్కొంది. సగటున నెలవారీ పరిష్కరించే ఫిర్యాదుల రేటు, కమిషన్లో పెండింగ్లో ఉన్న వాటి ప్రకారం పరిష్కరించడానికి ఒడిశా రాష్ట్ర సమాచార కమిషన్ ఆరు సంవత్సరాల, ఎనిమిది నెలలు సమయం పడుతుందని అంచనా వేసింది. కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)లో అప్పీళ్లు, ఫిర్యాదులు పరిష్కరించడానికి ఒక సంవత్సరం, 11 నెలల సమయం పడుతుందనీ, జూన్ 30 నాటికి సీఐసీలో 36,788 అప్పీళ్లు, ఫిర్యాదులు ఉన్నాయి. మంగళవారం ఆర్టీఐ చట్టం 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన సమాచార కమిషన్ల పనితీరుపై నివేదిక ప్రకారం 2020 ఆగస్టు 1 నుంచి 2021 జూన్ 30 మధ్య 1.56 లక్షలకు పైగా అప్పీళ్లు, ఫిర్యాదులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది 25 రాష్ట్ర సమాచార కమిషన్లలో 1.35 లక్షలకు పైగా కేసులు పరిష్కరించబడ్డాయి. సీఐసీ 18,298 ఫిర్యాదులు, అప్పీళ్లు నమోదు చేసింది. 17,648 పరిష్కరించింది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు వివిధ కేసుల్లో సీఐసీ జరిమానా విధించింది. 2020 ఆగస్టు 1 నుంచి 2021 జూన్ 30 వరకు 1,988 కేసుల్లో సంబంధిత సమాచారాన్ని అందించనందుకు 21 కమిషన్ల ద్వారా రూ.2.48 కోట్ల జరిమానా విధించింది. సమాచార కమిషన్లు ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 20ని 59 శాతం ఉల్లంఘించాయి.