Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మరణాలు తగ్గడం లేదు. గత 24 గంటల్లో కరోనా కారణంగా 226 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో కొత్తగా 15,823 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 3,40,01,743కు చేరగా, మరణాలు 4,51,189కి పెరిగాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం 10.5 శాతం కేసులు అధికంగా నమోదయ్యాయి. ప్రస్తుతం 2,07,653 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 3,33,42,901 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98 శాతానికి చేరగా, మరణాల రేటు 1.33 శాతంగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 96.43 కోట్ల కరోనా డోసులను ప్రజలకు అందించారు. 2-18 ఏండ్ల లోపువారికి కరోనా టీకా కోవాగ్జిన్‌ను ఇవ్వడానికి నిపుణుల కమిటీ గ్రీన్ సిగల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, దేశంతో కరోనా కేసులు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లు టాప్-10లో ఉన్నాయి.
రష్యాలో మళ్లీ పెరుగుతున్న కొత్త కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు కరోనా కేసులు తగ్గుతూ వచ్చిన రష్యాలో మళ్లీ కొత్త కేసులు పెరుగుతున్నాయి.
అయితే, ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలు టాప్-3లో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో యూకే, రష్యా, టర్కీ, ఫ్రాన్స్, ఇరాన్, అర్జెంటీనా, స్పెయిన్, కొలంబియా, ఇటలీ, జర్మనీ, ఇండోనేషియా దేశాలున్నాయి. ఇప్పటివరకు ప్రపంచంలోని 221 దేశాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తం 23,96,03,002 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 48,84,371 మంది ప్రాణాలు కోల్పోయారని వరల్డోమీటర్ డాష్‌బోర్డు గణాంకాలు చెబుతున్నాయి.