Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐ, ఎన్సీబీ, ఈడీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తున్న కేంద్రం
- యూపీ ఎన్నికల నేపథ్యంలో శరద్ పవార్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే రాష్ట్రంలో రాజకీయాలు హీటేక్కుతున్నాయి. ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసేందుకు అన్ని పార్టీలు వ్యూహాలను రచించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓట్లు చీలకుండా ఉండేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన సూచించారు. బీజేపీని అడ్డుకునేందుకు అన్ని పార్టీలు కలసి రావాలని చెప్పారు. ఎన్నికల్లో ఓట్లు సాధ్యమైనంతగా చీలకుండా చూడటం చాలా కీలకమని శరద్ పవార్ అన్నారు. బీజేపీయేతర పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే అది బీజేపీకి లాభిస్తుందని చెప్పారు. లఖీంపూర్ ఖేరి ఘటనపై ఆయన స్పందిస్తూ.. కేంద్ర మంత్రి అజరు మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.