Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి, ఆరోగ్య శాఖకు నోటీసులు
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సమయంలో ప్రయివేటు ఆస్పత్రులు, కోవిడ్ రోగులు, వారి కుటుంబాలను ఆర్థికంగా ఇబ్బందుల పాల్జేసేలా వ్యవహరించాయా లేదా అని దర్యాప్తు చేయడానికి అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ అంశంపై పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. దీనిపై కేంద్రానికి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకి నోటీసులు పంపింది. కోవిడ్ రోగులకు చికిత్స చేసి ప్రయివేటు ఆస్పత్రులు గడించిన మొత్తాలపై ఆడిట్ చేసి, స్క్రూటినీ చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని పిటిషనర్ అభినవ్ థాపర్ కోరారు. పిటిషన్‌దారుడు లేవనెత్తిన అంశం తీవ్ర ఆందోళన కలిగించేదని, దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కోవిడ్‌తో మరణించిన రోగుల కుటుంబాలు చేసిన ఫిర్యాదులు కూడా ఆ పిటిషన్లో పొందుపరిచారు. ఏదో ఒక రీతిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని బెంచ్ పేర్కొంది. నిస్సహాయులైన రోగులపై అధిక చార్జీల భారాన్ని మోపారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయని బెంచ్ పేర్కొంది.