Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీలోని లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో నిందితుడిగా ఉన్న అంకిత్ దాస్.. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు బుధవారం హాజరయ్యారు. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. తన లాయర్ల బృందంతో కలిసి లఖింపూర్‌లోని క్రైం బ్రాంచ్ ఆఫీస్‌కు అంకిత్‌దాస్ చేరుకున్నారని వివరించారు. కాగా, అంకిత్ దాస్‌తో పాటు మరొక నిందితుడు లతీఫ్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేటు కోర్టులో లొంగిపోవడానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. మాజీ మంత్రి అఖిలేశ్ దాస్ మేనల్లుడే అంకిత్ దాస్. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజరు కుమార్ మిశ్రా కొడుకు ఆశిశ్ మిశ్రాకు అంకిత్ దాస్ అత్యంత సన్నిహితుడు. ఈనెల 3న లఖింపూర్ ఖేరీలో నిరసన చేస్తున్న రైతుల పైకి కారు దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఆశిశ్ మిశ్రాతో పాటు లవ్కుష్, ఆశిష్ పాండేలను ఇప్పటికే అరెస్టు చేశారు. ఎస్యూవీ కారు డ్రైవర్‌గా చెప్పబడుతున్న శేఖర్ భర్తిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో ఇప్పటికి అరెస్టయినవారి సంఖ్య నాలుగుకు చేరింది.